బీసీలకు 44 శాతం.. టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

ABN, Publish Date - Oct 17 , 2026 | 09:29 AM

పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్‌పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం రాత్రి ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్‌పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం రాత్రి ప్రకటించారు. వీరి ఎంపికలో టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మొత్తం 36 మందిలో 22 మంది.. అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. 16 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు. అంటే తొలి జాబితాలోనే 44 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు.


ఇవీ చూడండి

సీబీఐకి సాయి కృష్ణ కేసు.. అసలు నిజం బయటపడుతుందా.?

అమరావతి అభివృద్ధి పనులకు మరో రూ.15 వేల కోట్ల రుణం

Updated at - Oct 17 , 2026 | 09:29 AM