అమరావతి అభివృద్ధి పనులకు మరో రూ.15 వేల కోట్ల రుణం
ABN, Publish Date - Oct 17 , 2026 | 08:59 AM
రాజధాని అమరావతి అభివృద్ధి పనులు నిధుల కొరత లేకుండా ముందుకుసాగే మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమరావతి నిర్మాణం, అభివృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు అదనపు నిధులు సమకూర్చడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.
అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులు నిధుల కొరత లేకుండా ముందుకుసాగే మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమరావతి నిర్మాణం, అభివృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు అదనపు నిధులు సమకూర్చడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల రాజధాని ప్రాంత పర్యటనలో రెండు బ్యాంకుల ప్రతినిధులు పనుల పురోగతి, అభివృద్ధి, పెరుగుతున్న కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో రుణ సహాయానికి మార్గం సుగమమైంది. దీంతో తాజాగా చేపడుతున్న పనులకు అవసరమైన రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు ఆ రెండు బ్యాంకులు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Updated at - Oct 17 , 2026 | 08:59 AM