సీబీఐకి సాయి కృష్ణ కేసు.. అసలు నిజం బయటపడుతుందా.?

ABN, Publish Date - Oct 17 , 2026 | 09:05 AM

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసుకు సంబంధించి పిటిషనర్‌‌కు(సాయికృష్ణ తల్లి) రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసుకు సంబంధించి పిటిషనర్‌‌కు(సాయికృష్ణ తల్లి) రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. బాధ్యులైన అధికారులను గుర్తించి చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తును సీబీఐలోని సీనియర్ అధికారికి అప్పగించాలని సీబీఐ డైరెక్టర్‌‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి పూర్తి రికార్డులను వారంలోగా ప్రత్యేక మెసెంజర్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందజేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

Updated at - Oct 17 , 2026 | 09:11 AM