ఆర్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడమే నేను చేసిన తప్పు

ABN, Publish Date - May 17 , 2026 | 07:35 AM

తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తాను చేసిన అతిపెద్ద తప్పు అని వ్యాఖ్యానించడం తమిళ సినీవర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. కొంతకాలంగా జయం రవి, ఆర్తి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.


జయం రవి తన మనసులోని బాధను బయటపెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో అనేక మార్పులు వచ్చాయని, వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తాను కుటుంబాన్ని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని, కానీ పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోయాయని తెలిపారు.

Updated at - May 17 , 2026 | 07:37 AM