కొండా సురేఖపై వేటు పక్కా? హైకమాండ్ సీరియస్..!
ABN, Publish Date - Aug 22 , 2026 | 10:56 AM
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి.
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వరుస వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉండి.. కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సురేఖ అదుపు చేయకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా 25న..
Updated at - Aug 22 , 2026 | 10:59 AM