Jogulamba Gadwal: తల్లిని బస్ స్టాండ్‌లో వదిలేసిన కూతురు
ABN, Publish Date - Jan 15 , 2026 | 05:44 PM
గద్వాల జిల్లాలో గుండెను కలిచివేసే అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో ఉన్న తల్లిని కన్న కుమార్తె బస్టాండ్ లో వదిలేసింది. చివరకు ఆ తల్లి ప్రాణాలు విడిచింది.
జోగులాంబ గద్వాల, జనవరి 15: జిల్లాలో గుండెను కలిచివేసే అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. పెద్ద ఆముదాలపాడుకు చెందిన తల్లి, కుమార్తెలు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో 10 రోజులుగా తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి చికిత్స చేయించడానికి కుమార్తె వెనుకడుగు వేసింది. అంతేకాక తన తల్లి మరణిస్తే.. తమ ఇంటి ఓనర్లు ఏమైనా అనుకుంటారని అనుమానంతో ఏ బిడ్డా చేయని పని చేసింది. చావుబతుకుల మధ్య ఉన్న కన్న తల్లిని బుధవారం రాత్రి బస్టాండ్ లో వదిలేసి వెళ్లింది. అక్కడే నిస్సహాయస్థితిలో ఉన్న ఆ తల్లి చివరకు కన్నుమూసింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
కైట్ ఫెస్టివల్.. సందర్శకులను ఆకర్షిస్తున్న రంగురంగుల గాలిపటాలు
పొంగల్ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు
Updated at - Jan 15 , 2026 | 06:32 PM