జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు

ABN, Publish Date - Jun 14 , 2026 | 10:57 AM

జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి, జూన్ 14: రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జనసేన ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జనసేన నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలకు హాజరు కానున్నారు. అలానే ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలు, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి

రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్

Updated at - Jun 14 , 2026 | 11:00 AM