ఆష్లీ గార్డ్‌నర్ విడాకుల వివాదం.. మహిళా క్రికెట్‌లో కలకలం

ABN, Publish Date - Jul 14 , 2026 | 08:41 AM

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్‌నర్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గార్డ్నర్, మోనికా రైట్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్‌నర్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గార్డ్నర్, మోనికా రైట్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో మరో ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జియా వోల్ పేరు కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో జరిగిన మహిళల ప్రపంచకప్ సందర్భంగా గార్డ్‌నర్ మద్దతుగా మోనికా రైట్ ముంబైకి వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ప్రశంసించారు.


అయితే టోర్నీ ముగిసిన తర్వాత వారి సంబంధంలో సమస్యలు ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. కొంతకాలానికే ఇద్దరూ విడిపోగా, తమ బ్రేకప్‌‌నకు కారణం ఎవరో సూచించేలా మోనికా రైట్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. అందులో జార్జియా వోల్ ఫొటోను షేర్ చేయడంతో ఈ అంశం మరింత వైరల్ అయింది. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాత్రం ఈ వ్యక్తిగత వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరిస్తూ ‘నో కామెంట్’ అని తెలిపింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా ఈ వివాదంపై మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఆష్లీ గార్డ్నర్ విడాకుల వివాదం మహిళల క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, ప్రచారాలపై అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.

Updated at - Jul 14 , 2026 | 01:09 PM