విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్, రానా మధ్య సరదా సన్నివేశం

ABN, Publish Date - Nov 13 , 2026 | 05:46 PM

విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి నారా లోకేశ్, నటుడు రానా మధ్య సరదా సన్నివేశం జరిగింది.

నటుడు రానా దగ్గుబాటితో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం, విశాఖలో సినిమా రంగం అభివృద్ధిపై మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గేట్‌వేగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, సమాజ మార్పులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఔత్సాహికులు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తే వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో సినిమా రంగంతో పాటు క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 13 , 2026 | 06:01 PM