గంగమ్మకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Jan 15 , 2026 | 12:00 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గంగమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కుటుంబం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. రెండ్రోజులుగా సంప్రదాయ వేడుకలు, గ్రామీణ క్రీడలు, ప్రజలతో మమేకమై పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ (గురువారం) ఉదయం గ్రామ దేవత గంగమ్మకు సీఎం కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకూ పుష్పాంజలి ఘటించారు. పండుగ రోజు కావడంతో స్థానిక ప్రజలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున నారావారిపల్లికి చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ప్రతి ఇంటా పండుగ సంబరాలు అంబరాన్నంటాలి: పవన్, లోకేశ్
SriSailam Brahmotsavams: నాలుగో రోజుకు శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. పెరిగిన భక్తుల రద్దీ
Updated at - Jan 15 , 2026 | 12:39 PM