Share News

Pawan Kalyan: ప్రతి ఇంటా పండుగ సంబరాలు అంబరాన్నంటాలి.. డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేశ్

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:05 AM

తెలుగు ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రతి ఇంటా పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan: ప్రతి ఇంటా పండుగ సంబరాలు అంబరాన్నంటాలి.. డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేశ్
Pawan Kalyan

ఇంటర్నెట్ డెస్క్: దేశమంతటా విభిన్న పేర్లు, సంప్రదాయాలతో జరపుకునే మకర సంక్రాంతి సంస్కృతిలోని ఏకత్వం, సమష్టి భావాన్ని ప్రతిబింబిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎక్స్ వేదికగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.


‘దేశమంతటా విభిన్న పేర్లు, సంప్రదాయాలతో జరుపుకునే మకర సంక్రాంతి భారతీయ సంస్కృతిలోని ఏకత్వం, సమష్టి భావాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పర్వదినం నియమశీలత, ముందడుగు అనే సందేశాలను అందిస్తుంది. రైతుల పండుగగా నిలిచే మకర సంక్రాంతి.. ఋతువుల మార్పులు, అనిశ్చితులను తట్టుకుని దేశాన్ని పోషించే అన్నదాతలకు అంకితంగా నిలుస్తుంది. వారి కృషి, సహనం, త్యాగమే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది.. ప్రతి భారతీయుడి జీవనానికి ఆధారం. మకర సంక్రాంతి దేశంలో ఐక్యతను మరింత బలోపేతం చేసి సమృద్ధి, సమష్టి ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిద్దాం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు.


ఇది మన సంస్కృతి: నారా లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కూడా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని తెలుగు లోగిళ్లలో మకర సంక్రాంతి జరపడం మ‌న సంస్కృతి. అభివృద్ధి, సంక్షేమాలే పాడిపంట‌లై రాష్ట్రమంతా పెద్దపండుగ కళ సంత‌రించుకుంది. ప్రతి ఇంటా ఆనందాలు నిండుగా సంక్రాంతి పండుగ జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 09:30 AM