దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వాయిదా

ABN, Publish Date - Sep 28 , 2026 | 09:42 AM

దేశవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది యూఎఫ్​బీయూ.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చల అనంతరం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయనున్నాయి. వారంలో 5 రోజుల పని విధానం(5 day work week) డిమాండ్‌పై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

Updated at - Sep 28 , 2026 | 09:42 AM