ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:58 PM
ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్ సిలిండర్ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ సిటీ: ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్ సిలిండర్ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు పేదలపై చూపిన శ్రద్ధ పెద్దలపై ఎందుకు చూపరని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ నగరంలో ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ నెలాఖరులోగా నూరు శాతం వసూలు చేయాలని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు ఇటీవల ఆదేశా లు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మంగళవారం కాశిబుగ్గ ప్రాంతానికి వెళ్లారు.
ఈ క్రమంలో గొలుసుల సుజాత అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఇంటి పన్ను రూ.13 వేల వరకు ఉంది.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకెళ్లి జీపులో వేసుకొని వెళ్లారు. ఈ విషయాన్ని వీడియో తీసినస్థానికులు సోషల్‌మీడి యాలో వైరల్ చేశారు. దీంతో చిన్న మొత్తానికే పేదల ఇళ్లపై దాడి చేస్తున్న అధికారులు లక్షల రూపాయలు బకాయి ఉన్నవారి ఇంటి గడపకూడా ఎక్కడం లేదెందుకని, న్యాయం పేదలకు ఒక తీరు పె ద్దలకు ఒక తీరు ఉంటదా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య
Read Latest Telangana News and National News