తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:59 PM
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు.
వరంగల్: ముగ్గురు యువకుల ఈత సరదా వారి ప్రాణాలకు మీదకు తెచ్చింది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు కళాశాల సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) కాలువ వద్దకు వెళ్లారు. అనంతరం కాలువలోకి దిగారు. వరద ప్రవాహం అధికంగా ఉండడం, వీరికి సరిగా ఈత రాకపోవడంతో ముగ్గురూ కొట్టుకుపోయారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయినా యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం బాధిత కుటుంబాలకు తెలియజేసింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్ వద్దకు బయలుదేరారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..
ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..