Share News

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:12 PM

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు పోలీసులు.

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..
Hyderabad Traffic Diversion,

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు పోలీసులు. వాహనాల మళ్లింపు ప్రభావం ట్రాఫిక్‌పై ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేసేందుకు నేడు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఉన్నతాధికారులు నగరవాసులకు కీలక సూచనలు చేశారు. ఈ మార్పులు నగర ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు అని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..'ఓల్డ్ సిటీ, న్యూసిటీని కలిపే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ సాఫీగా సాగటమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టాం. మొదట్లో రెండు ఏళ్ల లోపే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తి చేస్తామని చెప్పాం. కానీ ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికే పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి' అని చెప్పారు. అలాగే నేడు ట్రయల్ రన్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లు.. బసవతారకం, అగ్రసేన్, సీవీఆర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించే విధంగా ఫ్రీ లెఫ్ట్‌లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అంశాలను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఫలితం ఆధారంగా మరో వారం ఈ వన్ వే పెట్టాలా, వద్దా? అనేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. నగర ప్రజలు, వాహనదారులు సహకరించాలని జోయల్ డేవిస్ కోరారు.


అయితే, నేడు ట్రాఫిక్ డైవర్షన్‌తో నగరవాసులు కొంత గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రోడ్ నంబర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రోజే ట్రాఫిక్ ఇంతగా ఉంటే పని దినాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, వచ్చే వారం రోజుల్లో పూర్తిస్థాయి అమలుపై నిర్ణయం తీసుకుంటామని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్‌పై నిరంతరం అవగాహన కల్పిస్తామని, పోలీసుల సూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కొమురం భీం జిల్లాలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..

Updated Date - Apr 05 , 2026 | 05:30 PM