రామప్పకు మైనింగ్ ముప్పు లేదు.. వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్‌పై సింగరేణి కీలక స్పష్టత
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:32 PM
కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న వార్తలపై సింగరేణి సంస్థ స్పష్టత ఇచ్చింది. రామప్ప దేవాలయానికి మైనింగ్‌తో ముప్పు ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది.
వరంగల్: కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న వార్తలపై సింగరేణి సంస్థ స్పష్టత ఇచ్చింది. రామప్ప దేవాలయానికి మైనింగ్‌తో ముప్పు ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు, సంబంధిత నివేదికలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
రామప్ప దేవాలయం సమీపంలో మైనింగ్ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయమైనా పురావస్తు శాఖతో పాటు ప్రతిష్టాత్మక సంస్థలు అందించే శాస్త్రీయ నివేదికల ఆధారంగానే ఉంటుందని సింగరేణి వెల్లడించింది. ఆలయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోమని స్పష్టం చేసింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆలయ పరిరక్షణకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది. పర్యావరణహిత, చట్టబద్ధమైన విధానాల్లోనే మైనింగ్ కార్యకలాపాలను చేపట్టేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఆలయ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సింగరేణి స్పష్టం చేసింది.
బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల సూచనలు, చట్టపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాతే వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని సింగరేణి సంస్థ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..