Share News

నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:19 PM

నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో సోమవారం పోలీసులు, ఇద్దరు అనుమానిత గ్యాంగ్ సభ్యుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ జసీమ్ అనే ఇద్దరు నిందితులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

 నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు
Delhi Encounter

న్యూఢిల్లీ: నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో ఇవాళ (సోమవారం) పోలీసులు, ఇద్దరు అనుమానిత గ్యాంగ్ సభ్యుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ జసీమ్ అనే ఇద్దరు నిందితులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉస్మాన్‌పూర్‌లోని తమ ఇంటికి చేరుకునేందుకు గ్యాంగ్ సభ్యులు కైఫ్, జసీమ్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్లనున్నారనే సమాచారం నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ పోలీసులకు అందింది. దీంతో ఆ ప్రాంతంలో వారి కోసం మాటు వేశారు. అయితే, పోలీసులు ఎదురుపడగానే నిందితులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.


ఈ ఎదురుకాల్పుల్లో నిందితులు కైఫ్, జసీమ్‌ల ఎడమ కాళ్లకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో బుల్లెట్లు తాకినా ఎలాంటి గాయాలు అవ్వకుండా బయటపడ్డారు. కాగా, నిందితులిద్దరికీ నార్త్‌ఈస్ట్ ఢిల్లీకి చెందిన రషీద్ కేవల్‌వాలా గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నాయకుడు రషీద్ కేవల్‌వాలాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అరెస్టైన ఇద్దరి నేరచరిత్ర, గ్యాంగ్‌తో వారి సంబంధాలు, ఇతర నేరాల్లో పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

సీఈసీ రాజీనామా చేయాలి.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు: ఖర్గే, నారాయణ

ఢిల్లీ-ఐజ్వాల్ విమానంలో కిడ్నీ పేషెంట్‌కు ట్రీట్మెంట్

Updated Date - Oct 05 , 2026 | 03:37 PM