ఢిల్లీ-ఐజ్వాల్ విమానంలో కిడ్నీ పేషెంట్‌కు ట్రీట్మెంట్
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:38 PM
ఢిల్లీ నుంచి మిజోరంలోని ఐజ్వాల్‌కు వెళ్తున్న విమానంలో ఓ కిడ్నీ పేషెంట్‌కు డాక్టర్లు ఆపన్నహస్తం అందించారు. మెడికల్ చెకప్ కోసం ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ఒక్కసారిగా శ్వాస అందక తీవ్రంగా ఆయాసపడ్డాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్లు స్పందించి పేషెంట్‌కు చికిత్స అందించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీ నుంచి మిజోరంలోని ఐజ్వాల్‌కు వెళ్తున్న విమానంలో ఓ కిడ్నీ పేషెంట్‌కు డాక్టర్లు ఆపన్నహస్తం అందించారు. మెడికల్ చెకప్ కోసం ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ఒక్కసారిగా శ్వాస అందక తీవ్రంగా ఆయాసపడ్డాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్లు స్పందించి పేషెంట్‌కు ట్రీట్మెంట్ అందించారు. తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆ రోగి.. జర్నీ మధ్యలో ఆక్సిజన్ డీసాచ్యురేషన్‌కు (రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోవడం) గురయ్యాడు.
అక్కడున్న వైద్యులు డాక్టర్ లాల్ రుయత్‌లుంగా, జనరల్ సర్జన్ డాక్టర్ ఎఫ్.రెంథాంగుపి, డాక్టర్ బెంజమిన్, మరో గ్యాస్టోఎంటరాలజిస్ట్ వెంటనే స్పందించి ఆ రోగికి చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికే రోగి ఆక్సిజన్ స్థాయి 40 శాతానికి పడిపోయింది. మాస్క్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయగా 60 శాతానికి చేరుకుంది. స్టెరాయిడ్లు, విమానంలో ఉన్న కొన్ని పరికరాలతో డాక్టర్లు అలాగే చికిత్స అందించారు. దీంతో రోగి ఆక్సిజన్ 90 శాతానికి చేరింది. ఒకవేళ రోగి పరిస్థితి మెరుగుపడకపోయుంటే విమానాన్ని కోల్ కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చేది.
అయితే రోగి పరిస్థితి మెరుగవడంతో విమానాన్ని ఐజ్వాల్‌లోని లెంగుపుయి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అప్పటికే గ్రౌండ్ స్టాఫ్ ఒక అంబులెన్స్‌ని సిద్ధం చేసి ఉంచడంతో రోగిని అందులో ఆసుపత్రికి తరలించారు. కాగా.. ప్రయాణానికి ముందు రోజు రాత్రి రోగి డయాలిసిస్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని సమాచారం. ఇక సకాలంలో స్పందించి రోగికి చికిత్స అందించి అతని ప్రాణాలు కాపాడిన డాక్టర్లను విమాన ప్రయాణికులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్ ధ్వంసం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..