Share News

ఆ రికార్డులను సమర్పించండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం

ABN , Publish Date - Oct 05 , 2026 | 01:55 PM

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఆ రికార్డులను సమర్పించండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం
Supreme Court Notice to EC

ఇంటర్నెట్ డెస్క్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన పారం-6 నిర్ణయాల రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఫారం-6 సవరణలు, ఓటర్ల జాబితా సవరణ (SIR) నిర్ణయాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.


ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో మాత్రమే జరగాలని ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని కోరారు. 'CEC & ECs Act' ప్రకారం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో జరగాలి అని అన్నారు. సీఈసీ ఒంటరిగా నిర్ణయించలేరని స్పష్టం చేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి నిర్ణయాలు అమలు చేశారని ఆరోపించారు.


వికాస్ సింగ్ వాదనల అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీజేఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈసీ సమర్పించిన రికార్డులను పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఫారం-6 మార్పులపై ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోనట్టైతే వాటిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందని కూడా పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

సీఈసీ రాజీనామా చేయాలి.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు: ఖర్గే, నారాయణ

ఢిల్లీ-ఐజ్వాల్ విమానంలో కిడ్నీ పేషెంట్‌కు ట్రీట్మెంట్

Updated Date - Oct 05 , 2026 | 03:46 PM