Share News

చిన్నారి ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం..

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:59 PM

ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో ఎలికట్టే కవిత, శ్రీనివాస్ దంపతులు నివసిస్తున్నారు.

చిన్నారి ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం..

జనగామ, ఏప్రిల్ 30: ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో ఎలికట్టే కవిత, శ్రీనివాస్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి మూడున్నర ఏళ్ల కుమార్తె మోక్షిత ఉంది. గురువారం ఇంటికి సమీపంలో పాప ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు ఆ పక్కనే మిషన్ భగీరథ కోసం తీసిన గుంతలో పడిపోయింది. కాసేపటి తరువాత చిన్నారి కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా.. ఎక్కడా కనిపించలేదు. చివరకు మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలో చూడగా.. చిన్నారి కనిపించింది. అపస్మారకస్థితిలో ఉన్న తమ కూతురుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


పాప మరణించిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల నిర్లక్ష్యమే తమ పాప మృతికి కారణమని.. తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. రహదారిపై చిన్నారి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని. మోక్షిత తల్లిదండ్రులకు, గ్రామస్తులకు సర్దిచెప్పారు.

దాదాపు 20 రోజుల క్రితం మిషన్ భగీరథ కోసం ఈ గుంతను తీసి.. అలా వదిలేశారని మోక్షిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మోక్షిత మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు

అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

Read Latest TG News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 09:11 PM