Share News

కాళేశ్వరం మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: దత్తాత్రేయ

ABN , Publish Date - May 30 , 2026 | 03:59 PM

లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయిందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాళేశ్వరం మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: దత్తాత్రేయ
Bandaru Dattatreya On Kaleshwaram Project

పెద్దపల్లి జిల్లా: హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గోదావరిఖనిలో పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇప్పటికే స్పష్టమైన నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం రైతులకు, ప్రజలకు పనికి రాకుండా పోయిందని విమర్శించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు.


ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దత్తాత్రేయ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు ప్రధాన బ్యారేజీల్లో ప్రస్తుతం నీరు లేకపోవడం ఆందోళనకర విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి, రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన సాగునీటిని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Updated Date - May 30 , 2026 | 04:27 PM