విశాఖ టూ హైదరాబాద్ గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:53 PM
హైదరాబాద్‌లో గంజాయి విక్రయానికి యత్నించిన ముగ్గురు నిందితులను ఈగల్ ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ హవేలీ, బాకారం ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చేశారు.
హైదరాబాద్, జులై 22: నగరంలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను ఈగల్ ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ హవేలీ, బాకారం ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 11.767 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5.88 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిని రాజమండ్రికి చెందిన బుర్తి రాజ్‌కుమార్(25), యర్నగుల లక్ష్మీజగదీశ్(20), మరంపూడి రవిరాజు(19)గా గుర్తించారు. వీరిలో లక్ష్మీ జగదీశ్ బీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రేశ్వంత్ అలియాస్ నిమ్ము అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, విచారణలో నిందితులు గంజాయిని విశాఖపట్నం నుంచి రైలులో హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. జులై 20న విశాఖలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, జులై 21న రైలులో నగరానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విశాఖ నుంచి రైలులో గంజాయి తరలింపు..
పోలీసుల విచారణలో నిందితులు గంజాయిని విశాఖపట్నం నుంచి రైలులో హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. జులై 20న విశాఖలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. జులై 21న రైలులో నగరానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ రవాణాకు పాల్పడినట్లు వెల్లడించారు. రిసాలగడ్డ వద్ద గంజాయి తీసుకునేందుకు రిసీవర్ల కోసం రేశ్వంత్ వెళ్లగా, అక్కడ వేచి ఉన్న మిగతా ముగ్గురు నిందితులను ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన బైక్ ఈఎంఐలు చెల్లించేందుకు గంజాయి రవాణాలోకి దిగినట్లు యర్నగుల లక్ష్మీ జగదీశ్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత
అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి
Read Latest Telangana News And Telugu News