మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:19 AM
మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
హైదరాబాద్ సిటీ: మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయలు, కీసరగుట్టకు స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసింది. శ్రీశైలానికి రంగారెడ్డి రీజియన్(Ranga Reddy Region)లోని అన్ని డిపోల నుంచి సాధారణ బస్సులతోపాటు 405 స్పెషల్ బస్సులు నడుపుతున్నామని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ జె. శ్రీలత(J. Srilatha) తెలిపారు.

ప్రత్యేకంగా నడిపే బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ బస్సుల సమాచారాన్ని టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040-234500 332లలో సంప్రదించి తెలుసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!
Read Latest Telangana News and National News