నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్సీ తాతా మధు వాఖ్యలపై చర్చ?
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:54 AM
తెలంగాణ వర్షకాల అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే సభ బయట, వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు(మంగళవారం)రెండో రోజు సమావేశంలో ఏం జరుగుతుందనే అంశం చర్చనీయాంశమైంది..
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ లోపల, వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండోరోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు మొదలుకానున్నాయి. స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో శాసనసభను మొదలుపెట్టనున్నారు.
స్పీకర్ గడ్డంప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై నేడు సభలో చర్చించనున్నారు. స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత హేయమైన చర్యగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. స్పీకర్ పదవిని కించపరచేలా మాట్లాడడం సభా గౌరవాన్ని దిగజార్చడమే అవుతుందని కాంగ్రెస్ మండిపడుతోంది. బీఆర్ఎస్ వ్యవహారంపై సభలో చర్చించాలని, ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది.
కంటతడిపెట్టిన స్పీకర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సభలో స్పీకర్ కన్నీళ్లుపెట్టుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్పీకర్ పదవిలో ఉన్నా సరే దళితులపై చిన్నచూపు పోవడంలేదని భావోద్వేగానికి గురయ్యారు.
మహిళా సభ్యులను అవమానించారు: బీఆర్ఎస్
నిరసన చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోకి రాకుండా తమను గేటు వద్దనే అడ్డుకునే అధికారం పోలీసులు లేదని ఆయన మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యీలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడిని కప్పిపుచ్చడానికే.. తాతా మధు స్పీకర్‌ను దూషించారంటూ కాంగ్రెస్ అసత్యఆరోపణలు చేస్తోందని వారు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News