Share News

TG Politis: హరీష్ రావుపై మరోసారి రెచ్చిపోయిన కవిత..

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:57 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే..

TG Politis: హరీష్ రావుపై మరోసారి రెచ్చిపోయిన కవిత..
Kavitha comments

సూర్యాపేట, జనవరి 4: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు.

అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.


ఇదే సమయంలో అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపైనా కవిత మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప.. కృష్ణా నది నీటి వాటాపై చర్చే పెట్టడం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని విమర్శించారామె. కృష్ణా నీటిపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్నాటకతో పేచీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదన్నారు.

కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై కవిత మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని.. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.


Also Read:

Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ఔట్.. తొలిసారి స్పందించిన ముస్తాఫిజుర్ రెహమన్

Animal Blood Rackets: మటన్ షాపులో దారుణం.. మూగ జీవాల రక్తం సేకరించి..

Venezuela New President Delcy Rodriguez: వెనెజువెలా నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియామకం

Updated Date - Jan 04 , 2026 | 12:32 PM