Animal Blood Rackets: మటన్ షాపులో దారుణం.. మూగ జీవాల రక్తం సేకరించి..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:30 AM
మటన్ షాపులో మేకలు, గొర్రెలు, ఇతర మూగ జీవాల రక్తం సేకరించటం మొదలెట్టారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొంతమంది దుర్మార్గులు మూగ జీవాల రక్తం సేకరిస్తూ ఉన్నారు. మటన్ షాపులో మేకలు, గొర్రెలు, ఇతర మూగ జీవాల రక్తం సేకరించటం మొదలెట్టారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
మటన్ షాపు ఓనర్‌తో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. షాపు నుంచి 180 ప్యాకెట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూగ జీవాల రక్తంతో కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
రాజేంద్రనగర్‌ను మూడు ముక్కలు చేయొద్దు..
అత్యంత అందమైన నేరస్థుడు.. 24 ఏళ్ల జైలు శిక్ష.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడంటే..