Most handsome criminal: అత్యంత అందమైన నేరస్థుడు.. 24 ఏళ్ల జైలు శిక్ష.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:06 AM
దారుణమైన నేరానికి పాల్పడి 24 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి విధించిన శిక్షను తగ్గించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ యువకుడు అందంగా, అమాయకంగా ఉండడమే.
దారుణమైన నేరానికి పాల్పడి 24 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి విధించిన శిక్షను తగ్గించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ యువకుడు అందంగా, అమాయకంగా ఉండడమే. అతని కళ్ళలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోందని, అతణ్ని క్షమించి వదిలేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతడు చేసిన నేరమేంటంటే.. (24 years prison sentence)
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఆ యువకుడి పేరు కామెరాన్ హెర్రిన్. 2018లో తన ఫోర్డ్ ముస్తాంగ్ కారును అత్యంత వేగంగా నడిపాడు. గంటకు ఏకంగా 160 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ రోడ్డు దాటుతున్న 24 ఏళ్ల మహిళ, ఆమె ఏడాది వయసున్న కుమార్తెను ఢీకొట్టాడు. అంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆ తల్లి, బిడ్డ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కామెరాన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత, సెప్టెంబర్ 2021లో, కోర్టు కామెరాన్ హెరిన్‌కు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది (viral criminal story).

కామెరాన్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కోర్టు స్పష్టంగా పేర్కొని శిక్షను ఖరారు చేసింది (world’s most handsome criminal). దాంతో కామెరాన్‌కు చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలా మంది స్పందించారు. ఇంత అందమైన కుర్రాడికి అంత పెద్ద శిక్ష ఏమిటని చాలా మంది ప్రశ్నించారు. అంత అందమైన వ్యక్తి అలాంటి పని ఎలా చేయగలిగాడు అని కొందరు కామెంట్లు చేశారు. అతడి అందాన్ని, అమాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
న్యూయార్క్‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..