పింఛన్ దరఖాస్తుదారులకు శుభవార్త.. ధ్రువపత్రాలు లేకున్నా అప్లై చేసుకోవచ్చు
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:38 PM
తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది. పింఛన్‌కు అప్లై చేసుకోవడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేని చాలా మంది లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 04: తెలంగాణ వ్యాప్తంగా చేయూత పథకానికి అర్హులైన అభ్యర్థులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు చేసుకుంటున్నారు. దీనికి అవసరమైన ధ్రువపత్రాల కోసం రెవెన్యూ, సదరం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున అప్లికేషన్లు రావడంతో ధ్రువపత్రాల మంజూరు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. పత్రాలు ఆలస్యంగా మంజూరు అవుతుండడంతో అభ్యర్థులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) కీలయ నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తుదారులు ముందుగా ఆన్‌లైన్, నిర్దేశిత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. కానీ, వెరిఫికేషన్ చేసే సమయంలో మాత్రం సంబంధిత ధ్రువపత్రాలను అధికారులకు సమర్పించవలసి ఉంటుంది.
కాగా.. కొత్త పింఛన్ దరఖాస్తు గడువు సెప్టెంబరు 15లోగా ముగియనున్నది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించని నేపథ్యంలో దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి:
కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..
10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది