Share News

తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:06 PM

తెలంగాణలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ రోడ్ సేఫ్టీ(టీఎంఏఆర్ఎస్) బ్యూరోను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పోలీస్‌లో ప్రత్యేక విభాగంగా టీజీ టీఎంఏఆర్ఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ అండ్ రోడ్ సేఫ్టీ(టీఎంఏఆర్ఎస్) బ్యూరోను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్‌ విభాగంలో ప్రత్యేక విభాగంగా టీజీ టీఎంఏఆర్ఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ బ్యూరో పని చేస్తుంది. ఏడీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారిని ఈ బ్యూరోకు డైరెక్టర్‌గా నియమించనున్నారు. ఇది ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తుంది. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఓఆర్ఆర్‌పై ప్రత్యేక హైవే పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తుంది. రోడ్డు ప్రమాదాలపై శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరుపుతుంది. ప్రతి ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మల్టీ డిపార్ట్‌మెంటల్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ-చలాన్లు, ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తుంది. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్, ఓవర్ స్పీడింగ్‌పై నిఘా ఉంచుతుంది. రిపీట్, సీరియల్ ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. మెట్రో, బుల్లెట్ రైలు సహా రైలు ప్రయాణ భద్రతపైనా పర్యవేక్షణ చేస్తుంది.


ట్రాఫిక్ సిబ్బందికి బాడీ వోర్న్ పరికరాలు

అలాగే, ప్రతి పోలీస్ స్టేషన్‌లో రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్‌ను నియమిస్తారు. ప్రతి కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ పోస్టు, ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ ట్రాఫిక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ విభాగంలో 300 పోస్టులను టీజీ టీఎంఏఆర్ఎస్‌కు తరలిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాల్లో 40 శాతం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్‌కు మళ్లిస్తారు. ఆ నిధులతో ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలను కొనుగోలు చేస్తారు. ట్రాఫిక్ సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు, రక్షణ పరికరాలను కూడా అందుబాటులోకి తెస్తారు. రాష్ట్ర ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 09:11 PM