సర్ గడువు మళ్లీ పెంపు
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:41 AM
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును భారత ఎన్నికల కమిషన్ మరోసారి పెంచింది.
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు వర్తింపు
డిసెంబరు 22న తుది ఓటరు జాబితా
ఈ నెల 30 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును భారత ఎన్నికల కమిషన్ మరోసారి పెంచింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్న ఈసీఐ.. ఇందులో భాగంగా ఏఎస్‌డీడీ కేటగిరీకి చెందిన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ నెల 30న సర్ తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా.. ఈ గడువును డిసెంబరు 22 వరకు పెంచింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, నాగాలాండ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ ఆదేశాలు అమలయ్యేలా ఈసీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నిర్ణయం ప్రకారం ఏఎస్‌డీడీ ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల ముద్రణ ప్రక్రియను 18న పూర్తిచేయాలని సూచించింది. అనంతరం క్షేత్రస్థాయిలో ఫారాలను పంపిణీ చేసి, వాటిని తిరిగి సేకరించే బాధ్యతను సంబంధిత ఎన్నికల అధికారులు చేపట్టాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నవంబరు 30తో ముగియనుంది. సేకరించిన ఫారాలపై అవసరమైన పరిశీలన, పరిష్కార చర్యలను డిసెంబరు 10లోగా పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. అదేవిధంగా నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను డిసెంబరు 15 వరకు కొ నసాగించాలని, తదుపరి సర్ తుది జాబితాను డిసెంబరు 22న ప్రచురించాలని పేర్కొంది.
ప్రజల నుంచి, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఏఎస్‌డీడీ కేటగిరీకి చెందిన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక గడువును కల్పించింది. ఇక ఏఎ్‌సడీడీ ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియతోపాటు ఎస్ఐఆర్-2026 సవరించిన షెడ్యూల్‌పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర అధికారులను ఈసీ ఆదేశించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సవరించిన షెడ్యూల్ వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News