Share News

kumaram bheem asifabad-ఆమెకు ధీమా

ABN , Publish Date - May 07 , 2026 | 10:32 PM

మహిళలు ఆర్థికాభివృద్దితో పాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పథకం మరింత ధీమా ఇవ్వనుంది. మహిళల ఆర్థికా భివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా పథకాన్ని 2028 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది

kumaram bheem asifabad-ఆమెకు ధీమా
లోగో

- ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు, రుణమాఫీ

- పథకాన్ని 2028 వరకు పొడగించిన ప్రభుత్వం

- జిల్లాలో 94,773 మంది సభ్యులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికాభివృద్దితో పాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పథకం మరింత ధీమా ఇవ్వనుంది. మహిళల ఆర్థికా భివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా పథకాన్ని 2028 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల్లో సభ్యు లుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా పరి హారం పొందే సౌలభ్యం కల్పించింది. దీనిపై జిల్లాలో స్త్రీనిధి రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత లబ్ధి చేకూరనుంది.

- జిల్లాలో 8,772 సంఘాలు..

జిల్లాలో 8,772 సంఘాలు ఉన్నాయి. ఇందులో 94,773 మంది సభ్యులు ఉన్నారు. వీరు స్త్రీనిధితో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అయా యూనిట్లు, ఉపాధి అవకాశాలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది ముఖ్యకార్యదర్వి ఇటివల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మహిళలు స్వశక్తి సంఘంలో ఉండి ఏదైనా సహజమరణం చెందితే వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే స్ర్తీనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ. 10 లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేయను న్నారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి రూ. 5 లక్షలు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, సంఘం సభ్యు లపై పడేది. గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 58 ఏళ్ల వా రు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తించనుంది.

మహిళలకు తోడ్పాటు

- దత్తారావు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి

మహిళలకు ప్రభుత్వం రుణాలు అందించి, ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఆర్థి కంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా అందనుంది.

Updated Date - May 07 , 2026 | 10:32 PM