Share News

హైదరాబాద్‌లో దారుణం.. భూమి కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:14 AM

ఆస్తి వివాదం చివరకు కన్నతండ్రి ప్రాణం తీసేంతవరకూ వెళ్లిన విషాద ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. మిగిలిన భూమిని తన పేరిట రాయాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చిన కుమారుడు.. రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో దారుణం.. భూమి కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు
Shadnagar Incident

హైదరాబాద్‌, అక్టోబర్ 8: నగర శివారులో భూవివాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భూమిని తన పేరుపై రాయాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చిన కుమారుడు.. చివరకు తండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన షాద్‌నగర్‌ పరిధిలోని ఫరూక్‌నగర్‌ మండలం దూసకల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోచయ్య (70)ను ఆయన కుమారుడు మల్లేశ్‌ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి సంబంధించిన భూమిలో మిగిలిన భూమిని తన పేరుపై రాయాలని కొంతకాలంగా మల్లేశ్‌ తండ్రిని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు వెల్లడించారు.


వివాదం తీవ్రస్థాయికి చేరడంతో మల్లేశ్‌ కోపంతో తండ్రి పోచయ్యపై దాడికి పాల్పడ్డాడు. రాయితో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన పోచయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో దూసకల్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. భూవివాదమే హత్యకు ప్రధాన కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మల్లేశ్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News

Updated Date - Oct 08 , 2026 | 10:53 AM