Share News

కామెడీ స్కిట్లతో పోటీ పడుతున్న బీఆర్ఎస్ సెట్టు.. స్కిట్టు: సామ రామ్మోహన్

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:36 PM

తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మాక్ అసెంబ్లీపై మార్క్ సెటైర్లు వేశారు.

కామెడీ స్కిట్లతో పోటీ పడుతున్న బీఆర్ఎస్ సెట్టు.. స్కిట్టు: సామ రామ్మోహన్

హైదరాబాద్: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మాక్ అసెంబ్లీపై మార్క్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన సామ రామ్మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీని కామెడీ స్కిట్‌తో పోల్చారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికీ పనికిరారంటూ విమర్శలు గుప్పించారు. మాక్ అసెంబ్లీలో పేరుతో ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఏమని పోస్ట్ చేశారంటే..

‘జబర్దస్త్‌తో పోటీపడుతున్న డ్రామా రావు సెట్టు.. స్కిట్టు.. అధికారంలోకి ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా డ్రామాలకు తప్ప దేనికీ పనికిరారని మరోసారి నిరూపించుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఈ పగటి వేషగాళ్ల వల్ల తెలంగాణ ‘0’ లాభం’ అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

Updated Date - Sep 12 , 2026 | 05:21 PM