తానా ఒహాయో వ్యాలీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమం..
ABN , Publish Date - Sep 12 , 2026 | 07:25 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం 'గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ' స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం పాల్గొని బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు.
అరోరా, ఒహాయో సెప్టెంబర్ 11, 2026: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం 'గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ' స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం పాల్గొని బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు. దీనికి లక్ష్మీ యార్లగడ్డ, నరేశ్ బొడ్డు, సుహాసిని అడ్డగడ, సాయిరెడ్డి టేకుర్తి సహకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం సేకరించిన బ్యాక్‌ప్యాక్‌లను అరోరా పాఠశాలల ప్రతినిధులకు వారంతా అందజేశారు.

స్థానిక విద్యార్థుల విద్య ప్రయాణానికి సహకరించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, స్థానిక నాయకులు, పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఈ సహకారాన్ని అరోరా పాఠశాలల నాయకత్వ బృందం అభినందించింది. ఈ సేవా కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, ఒహాయో వ్యాలీ బ్యాక్‌ప్యాక్ కో-చైర్ సతీశ్ దంతులూరి, తానా బ్యాక్‌ప్యాక్ చైర్ నరేశ్ బొడ్డులకు అరోరా పాఠశాలల నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, కార్యక్రమ విజయానికి సహకరించిన తానా టీమ్ స్క్వేర్ ఒహాయో కో-చైర్ సుహాసిని అడ్డగడ, ఒహాయో వ్యాలీ బాలోత్సవం కో-చైర్ ప్రియాంక యడ్లపల్లి, ఒహాయో వ్యాలీ కళాశాల కో-చైర్ లక్ష్మీ యార్లగడ్డకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాక్‌ప్యాక్‌ల సేకరణ, ప్యాకింగ్, రవాణా, పంపిణీలో సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, అరోరా పాఠశాలల నాయకత్వ బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది, సమాజ సభ్యులందరికీ తానా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఫీనిక్స్‌లో స్వరాల పండుగ… కట్టిపడేసిన ఇళయరాజా కార్యక్రమం!
బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్‌కు ఖతర్‌లో సన్మానం