‘నిజం గెలిచింది..’ సౌదీ అరేబియాలో టీడీపీ శ్రేణుల నిరసన
ABN , Publish Date - Sep 10 , 2026 | 02:00 PM
సౌదీ అరేబియాలోని తెలుగు దేశం పార్టీ శ్రేణులు ‘ నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడేళ్ల నాటి చంద్రబాబు అక్రమ అరెస్టు ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి యన్.చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో నిర్భంధించిన చీకటి సందర్భానికి నిరసనగా సౌదీ అరేబియాలోని తెలుగు దేశం పార్టీ శ్రేణులు ‘ నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ పిలుపు మేరకు బుధవారం రాత్రి రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ నేతలు జానీ బాషా, రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులను వెలిగించి తమ నిరసనను తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధ్ర చరిత్రలో ఒక చీకటి ఆధ్యాయంగా చంద్రబాబు అరెస్ట్ గాయం మిలిగిందని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్నుపాటి నరేశ్, గుత్తా వెంకటరావు, సత్యశ్రీనివాస్, ముజ్జమ్మీల్ షేక్, పోకూరి ఆనంద్ లు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:
ఫీనిక్స్‌లో స్వరాల పండుగ… కట్టిపడేసిన ఇళయరాజా కార్యక్రమం!
గల్ఫ్‌లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు