Share News

గల్ఫ్‌లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:16 PM

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను గల్ఫ్ దేశాలలోని జనసేన అభిమానులు ఇటీవల ఘనంగా నిర్వహించారు.

గల్ఫ్‌లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
Pawan Kalyan Birthday Celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను గల్ఫ్ దేశాలలోని జనసేన అభిమానులు ఇటీవల ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్‌, బహ్రెయిన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియాలో వేర్వేరుగా గల్ఫ్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు రక్తదానం, క్రీడా కార్యక్రమాలు, కేక్ కటింగ్, విందు కార్యక్రమాలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి తమ అభిమానాన్ని చాటారు. ఈ దేశాలలో మూడు వేల మందికి పైగా ఎన్నారైలకు ప్రవాసాంధ్ర బీమా పథకం కింద ఉచిత బీమా పాలసీలు చేయించినట్లుగా జనసేన గల్ఫ్ నాయకులు కేసరి త్రిమూర్తులు తెలిపారు.


రాస్ అల్ ఖైమా కేంద్రంగా గల్ఫ్ జనసేన యూఏఈ ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, ఫుజీరా, షార్జా తదితర ఎమిరేట్ల నుంచి జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. అంతకుముందు, కార్లలో ర్యాలీగా జనసేన కార్యకర్తలు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాస తెలుగు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వివిధ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించారు.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో టీఏజే ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు

ఫీనిక్స్‌లో స్వరాల పండుగ.. వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!

Updated Date - Sep 08 , 2026 | 05:28 PM