తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం
ABN , Publish Date - Mar 13 , 2026 | 07:06 PM
తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ కుంభకోణం గుట్టు రట్టు చేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొఫ్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ కుంభకోణం గుట్టు రట్టు చేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొఫ్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు అధికారులు గుర్తించారు.
కాగా నిందితుడు సందీప్‌కు సంబంధం ఉన్న ఇతర సంస్థల్లోనూ పలు భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అయితే సందీప్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్