Share News

మీ ఆస్తుల లెక్క తేలుస్తా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:01 PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. 'దమ్ముంటే మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అన్నారు. 'హైటెక్‌ సిటీ పక్కన స్టార్‌ హోటళ్లు మీ పేరు మీద లేవని చెప్పగలరా? ఉన్నాయని నేను నిరూపిస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా' అని సీఎం రేవంత్‌ శపథం చేశారు.

మీ ఆస్తుల లెక్క తేలుస్తా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!
CM Revanth Reddy Challenges KCR, Demands White Paper on Assets

హైదరాబాద్, సెప్టెంబర్ 30: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలపై ధైర్యముంటే తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.


మాదాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో ఉన్న పలు స్టార్/ఫైవ్ స్టార్ హోటళ్ళు కేసీఆర్ కుటుంబ సభ్యులు లేదా వారి అనుచరుల పేరిట లేవని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అవి వారివేనని తాను నిరూపిస్తానని, నిరూపించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు.


గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులు, భూములు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ కుటుంబీకుల పేరిట ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.


కేసీఆర్ కుటుంబానికి అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుక్కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Sep 30 , 2026 | 08:09 PM