Share News

స్టీల్‌ ఫ్యాక్టరీలో గంజాయి కలకలం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:24 AM

వికారాబాద్‌ జిల్లా పరిగి శివారులోని సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో సీసీఎస్‌, పరిగి పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

స్టీల్‌ ఫ్యాక్టరీలో గంజాయి కలకలం

  • 15 మంది కార్మికులకు పాజిటివ్‌.. కేసు నమోదు

పరిగి, నవంబరు 28 (ఆంద్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా పరిగి శివారులోని సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో సీసీఎస్‌, పరిగి పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గోప్య సమాచారం మేరకు దాడులు నిర్వహించగా... కార్మికులు భారీగా గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పరిశ్రమలో పని చేస్తున్న 50 మందికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేల్చారు.


వీరందరిని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని.. గంజాయి పాజిటివ్‌ వచ్చినవారందరిని కోర్టులో హాజరుపరుచనున్నారు. అలాగే పరిగి పట్టణంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. గంజాయి తాగుతున్నారని నలుగురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. పోలీసులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గంజాయి పాజిటివ్‌ వచ్చిన కార్మికులు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 05:24 AM