వికారాబాద్లో చిరుత కలకలం.. రైతుపై దాడికి యత్నం..
ABN , Publish Date - Nov 22 , 2026 | 03:04 PM
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ శివారులో ఓ రైతుపై చిరుతపులి దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణ అనే రైతు తన పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుతపులి దాడికి ప్రయత్నించింది.
వికారాబాద్ జిల్లా, నవంబర్ 22: పరిగి మండలం నస్కల్ శివారులో ఓ రైతుపై చిరుతపులి దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణ అనే రైతు తన పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుతపులి దాడికి యత్నించింది. దీంతో తీవ్ర భయాంభ్రాంతులకు గురైన రైతు వెంటనే కేకలు వేస్తూ పరుగులు తీశాడు. సమీప పొలాల్లో ఉన్న రైతుల వద్దకు చేరుకుని కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన తోటి రైతులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పరిగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు హుటాహుటిన నస్కల్ గ్రామానికి చేరుకున్నారు. చిరుతపులి సంచారంపై ఆరా తీస్తున్నారు. గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, అక్టోబర్ 22న ఓ రైతుకు చెందిన లేగదూడపై గుర్తుతెలియని జంతువు దాడి చేసింది. మరోవైపు, రెండు మూడు రోజులుగా దోమ మండలం దిర్సంపల్లి సమీపంలోనూ చిరుత సంచరిస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. చిరుతపులిని త్వరగా పట్టుకోవాలని రైతులు, రైతు కూలీలు, ఆయా గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం సహకరించకపోయినా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి: సందీప్ కుమార్