Share News

హైదరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ఒక్కరోజే 288 మందిపై కేసులు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:38 AM

వీకెండ్ సందర్భంగా సైబరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఒక్కరోజే నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 288 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు

హైదరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ఒక్కరోజే 288 మందిపై కేసులు
Cyberabad Drunk and Drive

హైదరాబాద్, నవంబరు 22: నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఒక్కరోజు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 288 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 241 మంది బైక్ రైడర్లు, 12 మంది ఆటో డ్రైవర్లు, 34 మంది కార్ డ్రైవర్లు, ఒక హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. బీఏసీ పరీక్షల్లో 231 మందికి 36 నుంచి 200 ఎంజీ, 37 మందికి 201 నుంచి 300 ఎంజీ, మరో 20 మందికి 301 నుంచి 550 ఎంజీ వరకు ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన 288 మందిని కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.


మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమై ప్రాణనష్టం కలిగిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గత వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన 218 కేసులను కోర్టులు పరిష్కరించినట్లు వెల్లడించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 12:05 PM