Share News

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, సర్వేయర్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:25 AM

రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్‌, సర్వేయర్‌ ఏసీబీకి చిక్కారు. మండలంలోని వెంచర్‌ లేఅవుట్‌కు సంబంధించి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే కోసం సదరు లేఅవుట్‌ నిర్వాహకులు..

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, సర్వేయర్‌
Sudarshan Reddy

  • వెంచర్‌ లేఅవుట్‌ సర్వేకు 30 లక్షలు డిమాండ్‌

  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్‌/హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్‌, సర్వేయర్‌ ఏసీబీకి చిక్కారు. మండలంలోని వెంచర్‌ లేఅవుట్‌కు సంబంధించి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే కోసం సదరు లేఅవుట్‌ నిర్వాహకులు.. తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులును కలిశారు. అయితే ఆ సర్వే నిర్వహించేందుకు వారు రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో నిర్వాహకులు రూ.20 లక్షలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను సంప్రదించారు.


ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బాధితుల నుంచి సర్వేయర్‌ రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సర్వేయర్‌ను విచారించగా.. ఆయన తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకే డబ్బులను తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులును అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:25 AM