Share News

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:03 AM

తెలంగాణలో విద్యుత్తు పంపిణీ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థగా ఏర్పాటైన తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూష న్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)కు ..

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ
Telangana Rythu DISCOM

  • నెట్‌వర్క్‌ను కేటాయిస్తూ జీవో 12 జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యుత్తు పంపిణీ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థగా ఏర్పాటైన తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూష న్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)కు ఉద్యోగు లు, విద్యుత్తు పంపిణీ నెట్‌వర్క్‌, ఆస్తులు, అప్పులు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, ఇతర బాధ్యతలను బదిలీచేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో 12ను జారీ చేసింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌ 131 ప్రకారం ఈ విభజన అమలు చేయనున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీ సీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్‌) పరిధిలోని నిర్ధిష్ట వినియోగదా రుల క్యాటగిరీలకు సంబంధించిన కార్యకలాపాలను ఆర్‌పీడీసీఎల్‌కు బదలాయించారు.


రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, ఎత్తి పోతల పథకాలు, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ నగరంలో నీటి సరఫరా, సివరేజ్‌ బోర్డు, ప్రత్యేక డీటీఆర్‌లలో ఉన్న కొన్ని మున్సిపల్‌ వాటర్‌ కనెక్షన్ల నిర్వహణ బాధ్యతలను ఆర్‌పీడీసీఎల్‌కు బదిలీ చేశారు. షెడ్యూల్‌-ఏ ప్రకారం 2026 ఆగస్టు 31 నాటికి 30,60,821 వ్యవసాయ కనెక్షన్లు, 512 ఎత్తిపోతల, 1,045 వాటర్‌బోర్డు, 1,145 మిషన్‌ భగీరథ, 270 ప్రత్యేక డీటీఆర్‌లలో ఉన్న నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రాథమికంగా 30,63,793 కనెక్షన్లు అవుతున్నాయని.. బదిలీ అమల్లోకి వచ్చేనాటికి వాస్తవ వివరాలను వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్‌ -బీ ప్రకారం మొత్తం 6,15,651 వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) 21,717 ఎంవీఏ సామర్ధ్యం, 2,51,213 కీలోమీటర్ల వ్యవసాయ ఎల్టీ లైన్లు కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి.


వీటి పుస్తక విలువ సుమారు రూ.3,165 కోట్లు. ఆర్‌పీడీసీఎల్‌ కార్యకలాపాల కోసం సుమారు 2,000 మంది సిబ్బందిని ప్రాథమికంగా ప్రతిపాదించారు. ఇందులో 600 మంది ఇంజినీర్లు, 1,000 మంది అపరేషన్‌- మెయింటనెన్స్‌ సిబ్బంది, ఆర్టిజన్లు, 340 మంది పరిపాలనా సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్‌-ఈలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆర్‌పీడీసీఎల్‌ పరిధిలోకి వచ్చే ఆస్తుల విలువ సుమారు రూ.46,155 కోట్లు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. బదిలీ ప్రక్రియలో ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, పెండింగ్‌ కేసులు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలు నిలిచిపోకుండా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయానికి శ్రీకారం

కాంగ్రెస్‌ది రాక్షస జాతి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:03 AM