కాంగ్రెస్‌ది రాక్షస జాతి
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:53 AM
కాంగ్రెస్ పార్టీది రాక్షస జాతి అని... ఆపార్టీకి సరిపోయేది శ్రీరాముడు కాదని, బిన్‌లాడెన్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ పార్టీకి సరిపోయేది రాముడు కాదు లాడెన్
ఓట్ల తొలగింపుపై పొన్నం సవాల్‌కు సిద్ధం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీది రాక్షస జాతి అని... ఆపార్టీకి సరిపోయేది శ్రీరాముడు కాదని, బిన్‌లాడెన్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గోవాలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీని ‘రావణుడు’ అని.. కాంగ్రె్‌సను ‘రాముడు’ అని పేర్కొనడం ఆయన అవివేకానికి పరాకాష్ట.. రాక్షస ప్రవృత్తి ఎవరిదో చరిత్ర చూస్తే తెలుస్తుంది.. ఎమర్జెన్సీ విధించి, అరాచకాలు సృష్టించింది, రాముడి ఉనికినే ప్రశ్నించి రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది కాంగ్రెస్ కాదా?.. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగితే రాహుల్, రేవంత్ రెడ్డి హాజరు కాలేదు... రాముడు ధనికుల, శివుడు పేదల దేవుళ్లంటూ దైవానికే వర్గ విభజన తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ నేతలది.. ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని చెప్పే రేవంత్‌రెడ్డికి శ్రీరాముడి పేరు ఎత్తే అర్హతే లేదు..’’ అని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉండి రాముడి గురించి మాట్లాడితే మజ్లిస్ వాళ్ల మనసులు నొచ్చుకుంటాయన్న భయంతోనే.. సీఎం గోవాకు వెళ్లి రాముడి పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా ఓట్లు తొలగించారంటూ మంత్రి పొన్నం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు వస్తాను. ఓట్లు తొలగించారని చెబుతున్న పది మందిని తీసుకురండి. వారి వివరాలను కంప్యూటర్లలో చెక్ చేద్దాం.. అర్హుల ఓటు తొలగించినట్లు నిరూపించండి’ అని రాంచందర్‌రావు పొన్నంకు సూచించారు.
రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ‘ఇండీ’ కూటమి ముప్పేట దాడి: లక్ష్మణ్
రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ‘ఇండీ’ కూటమి ముప్పేట దాడి చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థించినప్పటికీ, 42 మంది విశ్రాంత న్యాయమూర్తులు బహిరంగ లేఖ ద్వారా నిరాధార ‘ఓట్ చోరీ’ ఆరోపణలను తప్పుపట్టినప్పటికీ కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శించారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే సర్‌పై బహిరంగ చర్చకు రావాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జేఎన్‌టీయూ వీసీ క్వార్టర్లను బార్‌లా మార్చారు
ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయానికి శ్రీకారం
ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్ పోరాటం
Read Latest AP News And Telangana News And International