Share News

జేఎన్‌టీయూ వీసీ క్వార్టర్లను బార్‌లా మార్చారు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:35 AM

జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి తన క్వార్టర్లను బార్‌లా మార్చారని, ఆయన దుందుడుకు వ్యవహారశైలి, అవినీతి, అక్రమాలకు సంబంధించి ఆరోపణలు పెరిగాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు.

జేఎన్‌టీయూ వీసీ క్వార్టర్లను బార్‌లా మార్చారు
Palla Rajeshwar Reddy

  • వీసీ భార్య నాపై చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నా..

  • ఆయనపై సమగ్ర విచారణ జరపాలి

  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి తన క్వార్టర్లను బార్‌లా మార్చారని, ఆయన దుందుడుకు వ్యవహారశైలి, అవినీతి, అక్రమాలకు సంబంధించి ఆరోపణలు పెరిగాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. జేఎన్‌టీయూ వీసీ భార్య సుజనారెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో తనపై చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో సుజనా చేసిన ఫిర్యాదు అవాస్తవమని, ఆమె ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని, ఆమెతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాగా తమ వీజీఐటీ నుంచి వీసీని కలిసేందుకు వెళ్లిన మహిళా ప్రొఫెసర్లను దూషించడానికి కారణాలేమిటని వీసీకి ఫోన్‌ చేసి ప్రశ్నించానని అన్నారు.


దానికి ఆయన స్పందిస్తూ తప్పు జరిగిందంటూ.. క్షమాపణ కూడా చెప్పారని, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నానని తిరిగి రాగానే ఇదే విషయంపై క్షమాపణ లేఖ ఇస్తాన ని అన్నారని, ఇదే జరిగిన వాస్తవమని తెలిపారు. అయితే క్షమాపణ లేఖ రాకపోవడంతో ఆయనపై మహిళా ప్రొఫెసర్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి సమాచారాన్ని పోలీసులకు సరిగా ఇవ్వకుండా.. ఆయన భార్యతో తనపై ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. మహిళా ప్రొఫెసర్ల పట్ల వ్యవహరించిన తీరుకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని పల్లా డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టెండరు ప్రక్రియను అడ్డుకోలేం

రైతులతో రేవంత్‌ నాటకాలు

ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్‌ పోరాటం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:41 AM