రైతులతో రేవంత్ నాటకాలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:29 AM
రైతు వేదికల వద్ద రాష్ట్రంలోని అన్నదాతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే విషయమై సీఎం రేవంత్ రెడ్డి నాటకాలాడారని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఆరోపించారు.
అన్నదాతల సమస్యల పట్ల సర్కారు నిర్లక్ష్యం: హరీశ్
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతు వేదికల వద్ద రాష్ట్రంలోని అన్నదాతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే విషయమై సీఎం రేవంత్ రెడ్డి నాటకాలాడారని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఆరోపించారు. ‘రేపు ఉదయం 12 గంటలకు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు రావాలని ఆదివారం రాత్రి మెసేజ్‌లు.. ఉదయం 9.52 గంటలకు రద్దయిందని.. 11 గంటలకు ఉంటుందని మరో మెసేజ్.. మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎంకు బదులు డిప్యూటీ సీఎం పాల్గొంటారని రైతులతో నాటకాలాడారు’ అని చెప్పారు. రైతు సమస్యలపై సీఎం అధ్యక్షతన సమావేశం ఉంటుందని మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన రోజే గోవా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. మరునాడు ఢిల్లీకెళ్లారని, ఆయన బాటలోనే మంత్రులు కూడా హస్తిన బాట పట్టారన్నారు.
రైతులు పంటలు సాగు చేయకుంటే ఏం చేయాలని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరంటు కోత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ‘రెండు చేతులా సంపాదన.. కేంద్రీకృత టెండర్లలో కమీషన్ల దందా.. సంక్షేమ హాస్టళ్లకు సరుకుల సరఫరాలో అవినీతి’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌ను హరీశ్‌రావు తన ఎక్స్ ఖాతాలో పోస్టుచేశారు. గురుకుల సంస్థల కాంట్రాక్టుల్లో జరుగుతున్న 20 శాతం కమీషన్లపై ఎందుకు విజిలెన్స్, సిట్ విచారణ చేపట్టడం లేదని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ ఖాతాకు తన పోస్టును ట్యాగ్ చేశారు.
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట
హరీశ్‌రావు మామ మాధవరపు హన్మంతరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందినదిగా పేర్కొంటున్న 3.22 ఎకరాల భూమి విషయంలో తుది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని రెవెన్యూశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని సర్వే నెంబర్ 271/18 ఈఈ, 271/18ఈ, 271/98లోని 3.22 ఎకరాలు అసైన్డ్ భూమి అని, దానిని హన్మంతరావు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఆ కొనుగోలు చెల్లదని, అందువల్ల దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ షోకాజ్ నోటీసులు పంపారు. వాటిని అడ్డుకోవాలని కోరుతూ మాధవరపు హన్మంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. షోకాజ్ నోటీసుకు రెండువారాల్లో వివరణ ఇవ్వాలని హన్మంతరావుకు ఆదేశాలు జారీచేసింది. తది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని రెవెన్యూ అధికారులకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్ పోరాటం
Read Latest AP News And Telangana News And International