ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:08 AM
బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మొదలైంది. స్పెషల్ బస్సు సర్వీసుల్లో మూడు రోజుల్లోనే (9, 10, 11) కోటి నలభై లక్షల మంది ప్రయాణించారు.
3 రోజుల్లో 1.4 కోట్ల మంది ప్రయాణం
15, 16, 17 తేదీల్లో 1,752 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మొదలైంది. స్పెషల్ బస్సు సర్వీసుల్లో మూడు రోజుల్లోనే (9, 10, 11) కోటి నలభై లక్షల మంది ప్రయాణించారు. రద్దీ మేరకు అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ, బస్సు సర్వీసుల నిర్వహణపై సోమవారం బస్‌భవన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో ఆయన వర్చువల్‌గా సమీక్షించారు.
పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అక్టోబరు 15, 16, 17 తేదీల్లో ఉప్పల్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మూడు తేదీల్లో మొత్తం 1,752 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనుంది. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంబీబీఎస్ మాప్ అప్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ
Read Latest AP News And Telangana News And International