Share News

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:12 AM

ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన
RTC Metro Common Pass

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. చార్జీలు అధికంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ కామన్‌ పాస్‌ ధర రూ.400 కాగా ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా నిర్ణయించారు.


నెలవారీ కామన్‌ పాస్‌ ధర రూ.8,500 కాగా ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500. అయితే ఈ చార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పొన్నం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ]

ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:12 AM