ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:13 PM
కల్తీ ఆహార తయారీ కేంద్రంపై హెచ్‌ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. జిల్లాలోని బొంగుళూర్‌లో M/s KSM ఫుడ్ ప్రొడక్ట్స్‌పై జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రంగారెడ్డి, ఆగస్టు 15: కల్తీ ఆహార తయారీ కేంద్రంపై హెచ్‌ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. జిల్లాలోని బొంగుళూర్‌లో M/s KSM ఫుడ్ ప్రొడక్ట్స్‌పై జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లేబుల్స్ లేని రసాయన సువాసన ద్రవ్యాలతో నాసిరకం ఆహారాన్ని తయారు చేస్తునట్టు తేలింది. నిర్వాహకులు అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారీ చేస్తున్నట్లు అధికారుల దాడుల్లో బయటపడింది.
వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఈజీ మనీ కోసం అక్రమంగా నాణ్యత లేని ఆహారపదార్థాల తయారీకి ప్లాన్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. తనిఖీల అనంతరం యజమాని మహ్మద్ ఖాలీద్, మేనేజర్ సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో దాదాపు 4.07 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ముడిసరుకు గడువు ముగిసిన ఫ్లేవర్లు, కాజూ, కొబ్బరి పొడి తదితర పదార్థాలను సీజ్ చేసిన అధికారులు.. నిందితులపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
స్నేహితుడి నంబర్‌తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం
Read Latest Telangana News And Telugu News