Share News

మేడ్చల్‌లో దారుణం.. పదోతరగతి విద్యార్థిపై దాడి

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:12 AM

మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు.

మేడ్చల్‌లో దారుణం.. పదోతరగతి విద్యార్థిపై దాడి
Medchal incident

మేడ్చల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్ రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం. కర్రలు, భోజనం ప్లేట్లతో కొట్టి.. బూట్లతో అభిషేక్ రెడ్డి ముఖంపై విద్యార్థులు తొక్కినట్లు తెలుస్తోంది. ఈ దాడి ధాటికి మెట్లపై నుంచి బాధితుడు కింద పడిపోయాడు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందజేశారు. అభిషేక్ రెడ్డిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 11:04 AM